పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి ప్రచారం
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండల పరిధిలోని వరికుంటపాడు, తిమ్మారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తూర్పు రాయలసీమ పిడిఎఫ్ టీచర్స్ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం టీచర్లతో సమావేసమయ్యారు. కార్యక్రమంలో ఆయన ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద్భంగా అయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను నిరుద్యోగులను మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆ ఇబ్బందులు తీరాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల యుటిఎఫ్ జిల్లా నాయకులు నాగార్జున, ప్రధాన కార్యదర్శి వివి సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు నాగార్జున, కరిముల్లా, హజరత్, కాంతారావు, డి.వెంకటేశ్వర్లు, ప్రభుదాసు, హరిచంద్ర ప్రసాద్, ఎల్‌వి రమణయ్య పాల్గొన్నారు.










