Mar 08,2023 22:11

హిందూపురంలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : యుటిఎఫ్‌ బలపరచిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ కోరారు. స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో సత్యసాయిజిల్లా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. అధికారపార్టీ అభ్యర్థులు అనేక అవకతవకలకు పాల్పడుతున్నారని, వేలాది దొంగ ఓట్లను చేర్పించారని విమర్శించారు. అంతేకాకుండా తాయులాలు పంపుతున్నారని ఆరోపించారు. ఇటాంటి పరిస్థితుల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి. నాగేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు పరిమితం చేసి సందర్శనల పేరుతో ఒత్తిడికి గురిచేసు న్న విద్యాశాఖ అధికారుల వైఖరికి నిరసనగా మార్చి 10వ తేదీ సాయంత్రం చేపట్టే జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ర్యాలీ, ధర్నా ను విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్రకార్యదర్శి కోటేశ్వరప్ప, జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు శ్రీనివాసులు, హరికృష్ణ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డికి మద్దతుగా రైతు సంఘం నాయకులు శ్రీరాములు, సిఐటియు మండల కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం రమేష్‌, తదితరులు ప్రచారం నిర్వహించారు. ఓటర్లు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును వీరికి వేయాలని కోరారు.
హిందూపురం : ఈ నెల 13న జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో పిడిఎఫ్‌ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిసిసి స్పోక్‌ పర్సన్‌ బాలాజీ మనోహర్‌, నాయకులు యూనూస్‌, అక్రమ్‌, ఆయాజ్‌, రవి, శివశంకర్‌, మహాబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు కృష్ణ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌ రెడ్డి, హిందూపురం పట్టణ ఎఐటియుసి కార్యదర్శి మారుతి రెడ్డి, పట్టణ నాయకులు నారాయణరెడ్డి, ఆది, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.