పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-అనంతసాగరం : పిడిఎఫ్ పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిడిఎఫ్ ఎన్నికల ప్రచార కమిటీ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలోని పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలిసి పిడిఎఫ్ తరుఫున పోటీ చేస్తున్న వారికి ఓటు వేయలని కోరారు. పిడిఎఫ్ నాయకులు మాట్లాడుతూ శాసన మండలిలో నిరుద్యోగ, చిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు వెట్టి చాకిరి విధానం రద్దు కోసం, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తున్నది, పిడిఎఫ్ తరుఫున గెలిచిన ఎంఎల్‌సిలు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గ ఉద్యమాలకు అండగా నిలుస్తున్నది పిడిఎఫ్ తరుఫున గెలిచిన ఎంఎల్‌సిలు మాత్రమేనపి అన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లురెడ్డి, ఎంఎల్‌సి ఎన్నికల కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ ఎస్ డి వల్లి అహ్మద్, యుటిఎఫ్ మండల కార్యదర్శి సాధిక్, జెవివి నాయకులు వేము పెంచలయ్య, సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌బాషా, అల్తాఫ్ రహంతుల్లా, తదితరులు పాల్గొన్నారు.










