Mar 04,2023 21:42

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలోని వైకుంఠపురం అన్నపుగుంట, మసీదు, పెద్ద పావని రోడ్డు, మంచాలవారివీధి, తదితర ప్రాంతాలలో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని శనివారం డివైఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెద్దల సభలో నిరుద్యోగులు, కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌, ఉపాధ్యాయ, కార్మిక వర్గ, ప్రయివేట్‌ విద్యాసంస్థల లెక్చరర్ల, ఉపాధ్యాయుల, తరఫున ప్రశ్నించేది పిడిఎఫ్‌ అని తెలిపారు.
పిడిఎఫ్‌ తరఫున పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న పొక్కిరెడ్డి బాబురెడ్డికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, బోగిశెట్టి కిష్టయ్య, జి.మధుసూదన్‌ రావు, డివైఎఫ్‌ఐ నాయకులు రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.