పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-అనంతసాగరం : తూర్పు రాయలసీమ శాసనమండలి ఎన్నికల్లో పిడిఎఫ్ తరుపున పోటీ చేస్తున్న పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వేంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలకు మొదటి ప్రాధన్యత ఓటు వేసి గెలిపించాలని శనివారం మండలంలో ప్రజా సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. ఉప్పలపాడు, కమ్మవారిపల్లి, పడమటి కంభంపాడు, సోమశిల గ్రామాల్లో ఉన్న పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలిసి పిడిఎఫ్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాసన మండలిలో నిరుద్యోగ, చిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వెట్టిచాకిరి విధానం రద్దు కోసం, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం, సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరణ చేయాలని పోరాటం చేస్తున్న పిడిఎఫ్ తరుఫున గెలిచిన ఎంఎల్‌సిలే అని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గ ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. పిడిఎఫ్ తరుపున పోటీ చేసే ఎంఎల్‌సి అభ్యర్థులను ఓటు కలిగిన పట్టభద్రులు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పింఛనుదారుల సంఘం నాయకులు మనిప్రసాద్, శ్రీ రాములు, సుధకర్ రావు, వేము పెంచలయ్య, ఖాజా మొహిద్దీన్, యుటిఫ్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి, యుటిఎఫ్ నాయకులు ఎంఎల్‌సి ఎన్నికల కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ ఎస్‌డి.వల్లిఅహ్మద్, సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌బాషా, తదితర రిటైర్డ్ ఉద్యోగులు, పింఛన్‌దారులు పాల్గొన్నారు.










