ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు
పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. బుధవారం స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, పలు వీధులో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ నిరుద్యోగ నిర్మూలన ఉపాధ్యాయుల గుర్తింపును కొనసాగించాలంటే ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరూ పిడిఎఫ్ ఎంఎల్‌సి పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను మొదటి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మహిళ సంఘ నాయకురాలు, ఎంపిటిసి కాకు విజయ, నాయబ్, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు.










