పిడిఎఫ్ అభ్యర్థులకు విజయం తథ్యం
- ఎంఎల్‌సి ఎన్నికల కమిటీ జిల్లా కన్వీనర్ ఎం.మోహన్ రావు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని బోగస్ ఓట్లు సృష్టించి కుట్రలు పన్నినా ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులు మీగడ వెంకటేశ్వర్ల రెడ్డి, పోక్కిరెడ్డి బాబుల విజయం తథ్యమని ఎంఎల్‌సి ఎన్నికల కమిటీ జిల్లా కన్వీనర్ ఎం.మోహన్‌రావు అన్నారు. సోమవారం ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా కొత్తూరులోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్యం మాఫియా కుంభకోణంలో ఉన్న వాళ్లని, విద్యను వ్యాపారంగా మార్చి కోట్లకు పడగలేత్తిన వాళ్లని అధికార పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచారన్నారు. ఈ ఎన్నికలు సాధారణ ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు, పట్టభద్రులకు, కార్పొరేట్ దిగ్గజాలకు మధ్య జరిగిన ఎన్నికాగా ఆయన అభివర్ణించారు. అధికార పార్టీ ఏన్ని బోగస్ ఓట్లు చేర్చి ధనాన్ని విపరీతంగా పంచి కుట్రలు చేసి, దొంగ ఓట్లను సృష్టించిన నిరుద్యోగులు, ఉపాధ్యాయులు వీటిని తిప్పి కొట్టి పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక వైసిపికి ఓటమి తప్పదని జోస్యం పలికారు. కార్యక్రమంలో జిల్లా సిఐటియు అధ్యక్షులు టివివి ప్రసాద్, ఇందుకూరుపేట సిపిఎం నాయుకులు మైపాటి కోటేశ్వరరావు, తిక్కవరపు ప్రభాకర్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ శ్యామ్‌రెడ్డి, వేణు, వెంకయ్య, శరత్, తదితరులు పాల్గొన్నారు.










