పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపును ప్రచారం
ప్రజాశక్తి-వరికుంటపాడు : నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలంటే యుటిఎఫ్ బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని యుటిఎఫ్ జిల్లా ప్రతినిధి ఆర్.నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన వరికుంటపాడులో యుటిఎఫ్ ఉపాధ్యాయులతో పిడిఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధ్యాయులను నిరుద్యోగులను మోసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆ ఇబ్బందులు తీరాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్‌వి నారాయణ, వివి సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు మేడసాని సుబ్బారావు, కరిముల్లా, కాంతారావు, వెంకటసుబ్బయ్య, ధనికుల వెంకటేశ్వరరావు, దామోదర్ రావు, బి.రమణయ్య, మనోహర్, గోపి, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.










