Mar 01,2023 21:45

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలోని వైకుంఠపురం 38వ వార్డు చేవూరు వారి తోట, తదితర ప్రాంతాలలో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని మంగళవారం డివైఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెద్దల సభలో ప్రజలు, ఉద్యోగుల, నిరుద్యోగుల తరపున ప్రశ్నించే అభ్యర్థి పిడిఎఫ్‌ తరఫున పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వర రెడ్డికి, ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న పొక్కిరెడ్డి బాబురెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, బోగిశెట్టి కిష్టయ్య, జి మధుసూదన్‌ రావు, వి.బాబురావు, సిఐటియు నాయకులు వై.కృష్ణమోహన్‌, డివైఎఫ్‌ఐ నాయకులు పసుపులేటి పెంచలనరసింహం, గోచిపాతల ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.