Feb 19,2023 22:19

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : స్థానిక బుడంగుంట ఎస్‌సి కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ఆదివారం పి.డి.ఎఫ్‌. ఎంఎల్‌సి అభ్యర్థుల గెలుపునకు ప్రజాసంఘాల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఓటర్లను కలిసి పిడిఎఫ్‌ తరుఫున పట్టభద్రుల ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అ
లాగే ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న పొక్కిరెడ్డి బాబురెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పసుపులేటి పెంచలయ్య, బి.కృష్ణయ్య, కె చెన్నయ్య, డి.వై.ఎఫ్‌.ఐ నాయకులు పి.కోటేశ్వరరావు, ఎస్‌.ఎఫ్‌.ఐ. నాయకులు రాకేష్‌, తదితరులు పాల్గొన్నారు.