ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకులు
పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : స్థానిక బుడంగుంట ప్రాంతంలో శుక్రవారం పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థుల గెలుపునకు ప్రజా సంఘాల నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఓటర్లను కలిసి నిత్యం రైతులు, కార్మికులు, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు పిడిఎఫ్ తరుఫున పట్టభద్రుల ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న పొక్కిరెడ్డి బాబురెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకలు నాయకులు పసుపులేటి పెంచలయ్య, వై.క్రిష్ణమోహన్, బి.కృష్ణయ్య, తపి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










