Mar 11,2023 21:32

ఫొటో : పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపు కోసం ఓట్లడుగుతున్న ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి - కావలి : తూర్పురాయలసీమ నియోజకవర్గంలో పిడిఎఫ్‌ అభ్యర్థులు, టీచర్స్‌ నుండి పొక్కిరెడ్డి బాబురెడ్డి, పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వర్లు రెడ్డిలను మొదటి ప్రాధాన్యతా ఓట్లు వేసి, గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు మూలం రమేష్‌ పిలుపునిచ్చారు. శనివారం కావలిలోని టీచర్లు, గ్రాడ్యుయేట్‌ ఓటర్లను నాయకుల బృందం వ్యక్తిగతంగా కలిసి ఓట్లు వేయాలని అబ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడిఎఫ్‌ అభ్యర్థులు, ప్రజా సేవకులుగా, అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. సిపిఎస్‌ రద్దుకోసం విజయవాడలో ఆందోళన చేసి అరెస్టులు కూడా అయ్యారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల అనేక సమస్యలపై జరిగిన ఉద్యమాలలో పోరాడారన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసిపి ఎంఎ్‌సి ఎన్నికల కోసం చిత్తూరు జిల్లాలో అనేకమంది డిగ్రీలు లేనివారిని సైతం నిబంధనలకు విరుద్ధంగా అధికారులను ఒత్తిడి చేసి ఓటర్లుగా చేర్పించారన్నారు. తిరుపతి కొండమీద ఉన్న పిక్‌ప్యాకెటర్లరకు కూడా ఓట్లు కల్పించారన్నారు.
10వ తరగతి చదివిన వారిని కూడా చేర్పించారన్నారు. 7వేలమంది బోగస్‌ ఓట్లు నమోదు చేశారు. అనర్హులకు ఓట్లు కల్పించారన్నారు. ఎలాగైనా గెలవాలన్న ఆశతో ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో 10వ తరగతి చదివినవారిని సైతం ఓటర్లుగా నమోదు చేశారన్నారు. మేధావులు, టీచర్లు, గ్రాడ్యుయేట్లు పోరాటయోధులైన పిడిఎఫ్‌ అభ్యర్థులకు తమ మొదటి ప్రాధాన్యతా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని మూలం రమేష్‌ ఓటర్లను కోరారు. అనంతరం మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర శాసనమండలికి తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి ప్రజాసంఘాలలో పనిచేసే వారందరూ పిడిఎఫ్‌ అభ్యరుల్థను గెలిపించాలని కోరారు. అధికారానికి రాకముందు సిపిఎస్‌ను రద్దు చేస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి 3 సంవత్సరాలైనా జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పి.పెంచలయ్య, జిల్లా వ్యవసాయ కార్మికసంఘం ఉపాధ్యక్షులు తాళ్లూరు మాల్యాద్రి, నాయకులు వై.కృష్ణమోహన్‌, జి.మధుసూధనరావు, ఎస్‌.కె.అమీర్‌బాషా, బొగిశెట్టి కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.