Mar 08,2023 21:45

ఫొటో : ప్రచారం నిర్వహిస్తున్న ప్రజాసంఘాల నాయకలు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : కావలి అరుంధతీయవాడ, కసాయివీధి, తదితర ప్రాంతాలలో పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని బుధవారం డివైఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెద్దల సభలో నిరుద్యోగులు, కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్‌, ఉపాధ్యాయ, కార్మికవర్గ, ప్రయివేట్‌, విద్యాసంస్థల లెక్చరర్ల ఉపాధ్యాయుల, తరపున ప్రశ్నించే అభ్యర్థి పిడిఎఫ్‌ తరఫున పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అలాగే ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న పొక్కిరెడ్డి బాబురెడ్డికి కూడా మొదటి ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పసుపులేటి పెంచలయ్య, బోగిశెట్టి కిష్టయ్య, జి.మధుసూదన్‌ రావు, వై.కృష్ణమోహన్‌, రమేష్‌, పసుపులేటి పెంచలనరసింహం, గోచిపాతల ప్రవీణ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.