ఫొటో : ఎన్నికల ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు
పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం
ప్రజాశక్తి-కావలి : పట్టణంలోని 25వ వార్డులో 100 అడుగుల రోడ్డు, 2టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు, సోమశిల ఆఫీసు ఆపోజిట్, ప్రాంతాలలో సిఐటియు, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం నిర్వహించారు. అనంతరం పిడిఎఫ్ తరఫున పట్టభద్రుల ఎంఎల్‌సిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కలిసి కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, బోగిశెట్టి కిష్టయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్, కె.చెన్నయ్య, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచల నరసింహం, నాయకులు పాశం కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










