పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయండి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగస్తులను ప్రశ్నించే హక్కు కూడా లేకుండా గట్టి ప్రయత్నం చేస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సమస్యల కోసం శాసనమండలలో గళం విప్పడం కోసం పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవడం ఎంతో అవసరమని ప్రజాసంఘాల నాయకులు మూలం రమేష్ పేర్కొన్నారు. ఆదివారం ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ ప్రయివేటు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని, దీనిని తిప్పి కొట్టాలంటే పిడిఎఫ్ ఎంఎల్‌సి పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చండ్ర రాజగోపాల్ మాటా ్లడుతూ శాసనమండలైన పెద్దల సభకు శాసనమండలిలో రాజకీయాలు తీసుకొచ్చి ఒక్కొక్కరు రూ.20, 30 కోట్లు డబ్బు ఖర్చుపెట్టి కార్పొరేట్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దొంగ ఓట్లు వేసుకొని గెలిచే దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అది జరగకుండా ఉండాలంటే గట్టి ప్రయత్నం చేసి అలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచించారు. పిడిఎఫ్ అభ్యర్థుల తరఫున ఇప్పటివరకు ఏడు మంది గెలిచినట్లు, మొత్తం ప్రజాసమస్య ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ శాసనమండలలో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తూ వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థులకు విద్యా వ్యవస్థకు, కార్మికులకు ప్రభుత్వం ఏ తప్పు చేసిన ప్రశ్నించేవారు, మేధావులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, విఠపు బాల సుబ్రమణ్యం లాంటి మేధావులు ప్రశ్నించే వారు గెలిచారన్నారు. ఉద్యోగుల సిపిఎస్ గురించి విజయవాడ సభకు మారు వేషాలలో వెళితే పోలీసులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విషయాన్ని అందరూ గుర్తు తెచ్చుకోవాలన్నారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించుకుని తీరాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జి శివప్రసాద్, మండల కార్యదర్శి కొండమూరి హజరత్తయ్య, పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు, గంట లక్ష్మీపతి, మూలి వెంగయ్య, యుటిఎఫ్ నాయకులు శివప్రసాద్, ఎల్‌ఐసి యూనియన్ నాయకులు రమేష్, ఆర్‌టిసి యూనియన్ నాయకులు మహమ్మద్‌అలీ, ఆవాజ్ రాష్ట్ర నాయకులు ఎస్థాని, రిటైర్ ఉపాధ్యాయులు ఎల్.కృష్ణ ప్రసాద్, శ్రీరాములు, నాయకులు ఆళ్ళ హజరత్తయ్య, తదితరులున్నారు.










