Feb 05,2023 21:57

ఫొటో : ప్రచారం చేస్తున్న సిపిఎం నాయకులు

పిడిఎఫ్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం 23వ వార్డులో సిపిఎం, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం పి.డి.ఎఫ్‌. ఎం.ఎల్‌.సి. అభ్యర్థి మీగడ వెంకటే శ్వరరెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. మీగడ వెంకటేశ్వర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కలిసి కోరారు.
కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య, బోగిశెట్టి కృష్ణయ్య, కె చెన్నయ్య, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి పెంచలనరసింహం, తదితరులు పాల్గొన్నారు.