పిడిఎఫ్ అభ్యర్థుల గెలుపు ఆవశ్యకం
- సిఐటియు జిల్లా కార్యదర్శి అజరు కుమార్
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : 13న జరగనున్న తూర్పురాయలసీమ శాసనమండలి ఎన్నికలలో పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఐటియు జిల్లా కార్యదర్శి అజరుకుమార్ పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లతో ఎంఎల్‌సి ఎన్నికలు ఓటింగ్ వేసే విధానం పోలింగ్ రోజు యాక్షన్ ప్లాన్ గురించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాదాల వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎంఎల్‌సి ఎన్నికలు ఒక ఆయుధంగా మలుచుకొని తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఎంఎల్‌సి ఎన్నికలలో పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లు రెడ్డితో 23మంది పోటీలో వెంకటేశ్వరరెడ్డికి 21వ నంబరు వచ్చిందని ఆయన పేరు ఎదురుగా వారు ఇచ్చిన పెన్‌తో ఒకటి నంబర్ వేయాలని, అలాగే ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డితో కలిసి 8 మంది పోటీ చేయగా ఆయనకు 6వ నెంబర్ రావడంతో ఆయన పేరు ఎదురుగా గడిలో ఒకటి వేయాలని తెలిపారు. ఎంఎల్‌సి ఎన్నికలు ఒక ఆయుధంగా మలుచుకొని వైసిపి అభ్యర్థులను డిపాజిట్ కూడా లేకుండా ఓడించే విధంగా మేధావులు ఆలోచించాలన్నారు. అనంతరం అజరు కుమార్ మాట్లాడుతూ ఎంఎల్‌సి ఎన్నికలు ఎంతో కీలకమైనవి ఈ శాసన మండలికి ఎంతోమంది మేధావులు మహానుభావులు ఉండే శాసనమండలిలో కూడా రకరకాల కేసులు విమర్శలకు లోనైన గ్యాంగులను శాసనమండలి కూడా పంపాలని ఒక పొలిటికల్ కలుషితమైన వాతావరణంలో ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికుల చట్టాలను మార్చేశారన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మేధావులు ఏకమై పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారికి పిలుపునిచ్చారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి శేషులు సిఐటియు జిల్లా నాయకులు జివి శివప్రసాద్, జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, ప్రజాసంఘాల నాయకులు డేవిడ్ రాజు, సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, యుటిఎఫ్ సీనియర్ నాయకులు ఎల్‌కె ప్రసాద్, యుటిఎఫ్ నాయకులు శివప్రసాద్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.










