Feb 21,2023 22:14

కరపత్రాలను అందజేస్తున్న నాయకులు

తనకల్లు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తినరసింహారెడ్డిని గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి.వి. రమణ, జిల్లా కమిటీ సభ్యులు శివన్న, కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ తోపు ఫారెస్‌ తెలుగు యూత్‌ మండల అధ్యక్షుడు కావడి ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు మండల కేంద్రంలోని వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల వాణిని చట్టసభల్లో వినిపించాలంటే పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పిడిఎఫ్‌ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.