కేంద్రంలోని బిజెపి సర్కారు మధ్య తరగతి జేబులకు భారీగా చిల్లులు పెట్టింది. 2014 నుంచి నేటి వరకు ఎనిమిదేళ్ల వ్యవధిలో సుమారు 75 నుంచి 100 దఫాలకుపైగా పెట్రో, డీజిల్ ధరలను పెంపు రూపంలో కాజేసింది. 2014 యుపిఎ హయాంలో పెట్రోల్ రూ.67 ఉండగా, కేంద్రంలోని బిజెపి సర్కారు హయాంలో ఎనిమిదేళ్లలో సుమారు రెట్టింపు చేసింది. పెట్రోల్ ధర రూ.111.11, డీజిల్ ధర రూ.43 నుంచి రూ.90 చేరుకుంది. యుపిఎ హయాంలోని ధరలకు రెట్టింపునకు మించిన స్థాయిలో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాపై రోజుకు యుపిఎ హయాంలో సుమారు రూ.2.5 కోట్లు ఉన్నట్లు అంచనా. ఎన్‌డిఎ హయాంలో పెట్రోల్‌పై రూ.4.5 కోట్లు, డీజిల్‌పై రూ.5.5 కోట్ల చొప్పున ఎనిమిదేళ్లకు సుమారు రూ.వందల కోట్ల భార పడింది. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే ధరల పెంపు జోలికి వెళ్లదు. లేకపోతే ధరల పెంపునకు అడ్డూ అదుపు లేకుండా పెంచురతోంది. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
ఉమ్మడి కడప జిల్లాలో సుమారు 12 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. అత్యధికంగా మో టార్‌బైక్‌లు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్లు ఉన్నాయి. సుమారు లక్షకుపైగా మోటార్‌బైక్‌లు, 25 వేలకుపైగా ఆటోలు, ఇతర వాహనాలు ఉన్నాయి. వీటిపైనే నిరుద్యోగ యువత, పేద, మధ్య తరగతి ప్రజానీకం ఆధారపడి జీవనం సాగిస్తోంది. 2014 సంవత్సరంలో రూ.62 నుంచి 2023 నాటికి లీటర్ పెట్రోల్ రూ.111 డీజిల్ రూ.98.89 చేరుకోవడం ఆందోళన కలిగించింది. 2014 నుంచి కేంద్రం ధరల దరవు మోగిస్తూనే ఉంది. ఒకవైపు కరోనా విజృంభణ, మరోవైపు ఉపాధి కరువై నిరు ద్యోగం ప్రబలిన పరిస్థితుల్లోనూ పెట్రో, డీజిల్ ధరలను పెంచి బిజెపి సర్కారు తన నిజరూపాన్ని బయట పెట్టుకుంది. 2018 సంవత్సరంలో జులై నుంచి నవంబర్ వరకు రోజు మార్చి రోజు చొపన వరుసగా పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోవడం ఆందోళన కలిగిం చింది. జిల్లాలో ప్రతిరోజూ పెట్రోల్ నాలుగు లక్షల లీటర్లు, డీజిల్ 5.50 లక్షల లీటర్లు వినియోగం అవుతోంది. పెట్రోల్ ధర రూ.111.11 చొప్పున 4.5 కోట్లు, డీజిల్ రూ. 5.5 కోట్ల చొప్పున వసూలు అవుతోంది. 2014లో యుపిఎ హయాంలో పెట్రోల్ రూ.62 నుంచి రూ.67, డీజిల్ సుమారు రూ.35 చొప్పున ఉన్నప్పుడు రూ.2.5 కోట్ల చొప్పున పెట్రోల్, డీజిల్ రూ.1.5 కోట్ల చొప్పున ఆదాయం లభించేది. ఎన్‌డిఎలోని బిజెపి సర్కారు హయాంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటడం తెలిసిందే. ఫలితంగా రోజుకు రూ.4.5 కోట్ల పెట్రో ఆదాయం, 5.5 కోట్ల డీజిల్ ఆదాయం లభిస్తోంది. రెట్టింపు స్థాయిలో ధరలను రెట్టింపు స్థాయిలో పెంచేసింది. జిల్లా నుంచి వందల కోట్లలో ఆదాయమూ లభిస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ ధరలపై అమెరికా ఆంక్షలు విధించింది. 20 నుంచి 30 శాతం తగ్గింపు ధరలతో రష్యా తన చమురును ఇండియాకు విక్రయిస్తోంది. 90 డాలర్ల క్రూడాయిల్ బ్యారల్ ధరల్లో సుమారు 20 నుంచి 30 డాలర్లకు తక్కువగా విక్రయిస్తోంది. పెట్రో వినియో గదా రులకు ధరల తగ్గింపుల్లో ఊరట లభించ కపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు అంతర్జా తీయంగా ధరలు పెరగడం వల్ల పెట్రో ధరలు పెరగడం అనివార్యమని సెలవి చ్చిన కేంద్ర మంత్రులు అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు తగ్గించకపోవడంలోని ఆంతర్య మేమిటో చెప్పడం లేదు. 2020, 2021 సంవత్సరాల్లో ఒక దశలో బ్యారల్ చమురు 25 డాలర్లకు పడిపోయింది.
సామాన్యులపై కేంద్రం దోపిడీ
ఒక వస్తువు ఉత్పత్తికి సంబ ంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే దానికి అను గుణంగా మార్కెట్‌లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఇంధన ధరల తగ్గినా ప్రజలపై భారాలు తగ్గిం చడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిం చకుండా సామాన్యుడి జేబును గుల్ల చేస్తూ దోపిడీ చేస్తోంది.
- డి.వెంకటేష్, వాహనదారుడు, పోరుమామిళ్ల
పెట్రోల్ ధరలు తగ్గించాలి
సామాన్య ద్వి చక్ర వాహనదారులపై బిజెపి ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి అధిక భారాలు మోపుతున్నారు. పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి. ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్యులపై భారం తగ్గించాలి
జి.బాబు నిరంజన్‌రెడ్డి, వాహనదారుడు వల్లూరు.
పేదలకు పెను భారం
మోడీ ప్రభుత్వం పేదల పాలిట పెనుభారంగా తయారైంది. పేదలను, ధనికులను ఒకే గాటికి కట్టేస్తూ గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచ డంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. స్కూటర్లు అమ్ముకొని సైకిళ్లుకొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.
- టి.హరికృష్ణ, వాహనదారుడు, రాజంపేట.
పెట్రో భారాన్ని అరికట్టాలి
రోజురోజుకీ పెరు గుతూన్న పెట్రోలు ధరలు సా మాన్యులకు అదనపు భారం. పెట్రోలు ధరల బాదుడుతో చేతి చమురును కూడా వదిలిం చుకోవలసి వస్తోంది. మధ్య తరగతి వారికి ఈ పెట్రోలు ధరల వాత తట్టుకోలేనిదిగా ఉంది.
-ఎన్.రఘునాథ్, వాహనదారుడు, పీలేరు.










