Jan 02,2023 21:16

పెషియల్‌...అటెన్షన్‌ యాప్‌

ప్రజాశక్తి - కడప ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యో గుల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ నమోదు ప్రక్రియ అమల్లోకి వచ్చింది. 2023 నూతన సంవత్సరం ఒకటో తేదీ ఆదివారం కావడంతో సోమవారం నుంచి అమలుకు నోచుకుంది. జిల్లా కేంద్రాల్లో సుమారు ప్రధాన ప్రభుత్వ కార్యాలయ హెచ్‌ఒడిలు, ఇతర కింది స్థాయి ఉద్యోగులు 10.30 నుంచి 10.40 గంటల్లోపు తప్పనికి విధుల నిర్వహణ నిమిత్తం తమ కార్యాలయానికి చేరుకోవాలి. కార్యాలయ ఆవరణలోనికి వెళ్లిన వెంటనే జిపిఎస్‌ సిస్టమ్‌ పని చేయడం మొదలవుతుంది. అప్పటికే ఆన్‌లైన్‌ నుంచి ఉద్యోగుల మొబైల్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసు కున్న ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను ఆపరేట్‌ చేయాల్సి ఉంది. అనంతరం ఉద్యోగుల పేరు, ఐడి టైప్‌ చేసిన వెంటనే యాప్‌ ఓపెన్‌ అవు తున్నట్లు తెలుస్తోంది. ఓపెన్‌ అయిన వెంటనే ఉద్యోగులు హాజ రు నమోదు చేసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో విధులకు గైర్హాజరైనట్లు భావించ నుంది. ఆరోజు విధులకు సంబంధించిన వేతనం కట్‌ అవనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ప్రధాన కార్యాలయాల హెచ్‌ఒడిలు ఫీల్డ్‌కు వెళ్లాల్సి వస్తే గంట ముందు యాప్‌కు సంబంధించిన ఫీల్డ్‌ ఆప్షన్‌ను ఓపెన్‌ చేసి ఫీల్డ్‌ వెళ్తున్న ఉద్దేశాన్ని నమోదు చేయాలి. అనం తరం ఫీల్డ్‌కు వెళ్లిన వెంటనే అక్కడి పరిసరాలతో కూడిన ఫొటోను అప్‌లోడ్‌ చేయా ల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
16 నుంచి పంచాయతీల్లో!
ఈ నెల 16 నుంచి సంక్రాంతి పండుగ అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. కడప జిల్లాలో 557, అన్నమయ్య జిల్లాలో 501తో కలుపుకుని 1,058 పంచాయతీ కార్యాలయాల్లోనూ ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌లో ఉద్యోగులు హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలోని ప్రధాన కార్యాలయాల హెచ్‌ ఒడిలు రెండు నెలల కిందటి నుంచి ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌లో హాజరును నమోదు చేస్తున్నట్లు సమాచారం. గతంలో నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టాను సారంగా విధులకు హాజరు కావడంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఫేషి యల్‌ రికగ్నిషన్‌ యాప్‌ నమోదు సాంకేతికతతో ఇటువంటి విమర్శలకు తెరపడనుంది.
ప్రభుత్వ ఉద్యోగుల్లో సనుగుడు
జిల్లాల్లోని ప్రభుత్వశాఖల పరిధిలోని వేలాది మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలోని 1,058 పంచాయతీల్లోని సచివాలయాలు, పంచాయతీ కార్యాలయ ఉద్యోగులు ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలోని రిమోట్‌ పంచాయతీలు, సచివాల యాల్లో సంబంధించి నెట్‌ పని చేయని ప్రాంతాల ఉద్యోగుల పరిస్థితి ఏమిటనే వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు కానుండడంతో ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరు కానుండడంతో పాలనా వ్యవహారాలు మెరుగపడే అవకాశం ఉందనే వాదన ఓ వైపు వినిపిస్తోంది. మరోవైపు జిల్లాలోని పలువురు ప్రభుత్వ ఉద్యో గుల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌లో హాజరు నమోదు చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవు తుండడం గమనార్హం.