Jan 17,2023 22:05

టోర్నీ బ్రోచర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - పెనుకొండ : ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నీని బుధవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సవితమ్మ మంగళవారం గ్రౌండ్‌ను పరిశీలించి టోర్నీ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు మాధవ నాయుడు, గుట్టూరు మాజీ సర్పంచి సూర్యనారాయణ, మిలటరీ నారాయణ, నాగరాజు రెడ్డి, అడదాకులపల్లి మాజీ సర్పంచి ప్రసాద్‌ త్రివేంద్ర నాయుడు, అరుణ్‌ రెడ్డి, మాజీ వైస్‌ సర్పంచి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.