Jan 02,2023 09:51

బికె.పార్థసారధికి శుభాకాంక్షులు చెబుతున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

        పెనుకొండ : పట్టణంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారథికి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌లు కట్‌ చేసి, క్యాలెండర్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి చిన్న వెంకటరాముడు, జిల్లా అధికార ప్రతినిధి రఘువీర చౌదరి, నియోజకవర్గం కమిటీల అధ్యక్షులు చిన్నప్పయ్య, ఉపాధ్యక్షులు రామలింగ, మండల కన్వీనర్‌లు సిద్ధయ్య, సిద్ధలింగప్ప, సోమశేఖర్‌, లక్ష్మిరెడ్డి, నరహరి, టౌన్‌ కన్వీనర్‌ రవిశంకర్‌, నాయకులు కేశవయ్య, రొద్దం నరసింహులు, వెంకటగిరి పాళ్యం శ్రీనివాసులు, గుట్టూరు నాగరాజు, పోతిరెడ్డి, హుజూర్‌, జావీద్‌, శివ శంకర్‌, షిఫారం శ్రీనివాసులు పాల్గొన్నారు.
పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ స్వగహంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, పరిగి, గోరంట్ల మండలాల నుంచి పార్టీ శ్రేణులు సవితమ్మను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్‌కట్‌ చేసి, క్యాలెండర్‌లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుట్టూరు సూర్యనారాయణ, మాధవనాయుడు, వెంకటరమణ, టైలర్‌ ఆంజనేయులు, మాజీ మండల కన్వీనర్‌ శ్రీరాములు, బాబుల్‌ రెడ్డి, వాసుదేవరెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.