May 27,2023 22:23

అసమ్మతి నేతలతో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

         పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గ పరిస్థితులపై వైసిపి రాయలసీమ రీజినల్‌ కోఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ పరిశీలకులు బాబురెడ్డి, ఎంఆర్‌సి రెడ్డితో కలసి శనివారం తిరుపతిలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో సుమా రు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు పార్టీలో తమకు జరిగిన అన్యాయాన్ని పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పెనుకొండ వైసిపి నాయకులు పుప్పం సుధాకరరెడ్డి, గంపల రమణారెడ్డి, అక్కులప్ప,చాలకూరు అశ్వర్థమ్మ, సి.నారాయణరెడ్డి, నాగభూషణ రెడ్డి, దిలీప్‌ రెడ్డి, బీచగానిపల్లి బాలాజీ, కర్ర సంజీవరెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, గోపాలరెడ్డి, కష్ణారెడ్డి, మురళి, తురకలపట్నం నరేంద్ర రెడ్డి, గుడిపల్లి కళ్యాణ్‌, చెన్నకష్ణారెడ్డి, గోరంట్ల లక్ష్మీనరసప్ప, మోతుకపల్లి శ్రీనివాసరెడ్డి, బొమ్మిరెడ్డి పల్లి రాము తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, వైసిపి నాయకులతో మంత్రి సమావేశం
వైసిపి రాయలసీమ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని స్వగహంలో పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.