Jan 08,2023 18:19

నూతన కమిటీ సభ్యులను సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : పట్టణంలోని ఎన్‌జిఒ హోంలో ఆదివారం ఎపి గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ మదనపల్లి శాఖ ఎన్నికలలో అధ్యక్ష, కార్యదర్శులుగా బిటి.నరసింహులు, బి.వెంకటరమణలు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు ఎపి ఎన్‌జిఒ చిత్తూరు జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సుధాకర్‌ పిల్లై, కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి కోదండ రాము, ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఆత్మానంద నాయుడు ఎన్నికల పరిశీలకులుగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను ఏకగ్రీవంగా నిర్వహించినట్లు ఎన్నికల పరిశీలకులు తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు జాయింట్‌ సెక్రటరీలు, పది మంది ఇసి మెంబర్లను ఏకగ్రీవ ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం మాజీ కార్యదర్శి ఎన్‌.మణి గోపాలకృష్ణ, పెన్షనర్లు పాల్గొన్నారు.