Mar 30,2023 22:09

పగిలిపోయిన పైపులైను

ప్రజాశక్తి - పరిగి : మండలంలోని కాలుపల్లి సమీపంలో ఉన్న నిషా గార్మెంట్స్‌ పరిశ్రమ పనితీరు రోజురోజుకు తీసికట్టుగా మారింది, స్థానికులు ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్‌ పైప్లైన్‌ ద్వారా వచ్చే కెమికల్‌ను వేస్టేజ్‌ పదార్థాన్ని ఊరి చివరి ప్రాంతంలో కానీ డంపు ఏరియాకు గాని తరలించాలి. అయితే యాజమాన్యం మాత్రం ఆ కెమికల్‌ పదార్థాన్ని పైప్‌ లైన్‌ ద్వారా నదీ ప్రాంతంలోకి తరలించడం గ్రామస్తుల ఆరోగ్యానికి ముప్పు వాటినే ప్రమాదం ఏర్పడింది.. ఈ పైపులైన్‌ ద్వారా ఫ్యాక్టరీలోనే వ్యర్థపదార్థాలను సరఫరా చేస్తున్నారో లేక ఈ పదార్థాలు నది ప్రాంతంలోకి రావడంతో వచ్చే నీరు కెమికల్‌ తో విలీనమైతే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై యాజమాన్యం ఏ మాత్రం స్పందించకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా నిషా గార్మెంట్స్‌ యాజమాన్యం స్పందించి పైప్‌ లైన్‌ ను మరమ్మతులు చేసి డంపు ఏరియాకు కెమికల్‌ ను తరలించే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.