Feb 23,2023 22:10

ఇసుకలో ఇబ్బందులు పడుతున్న వాహనదారుడు

        ప్రజాశక్తి-రొద్దం   పెన్నానదిలో నీటి ప్రవాహం నిలిచినా రోడ్డు సమస్య మాత్రం తీరలేదు. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు పెన్నానది పొంగి ప్రవహించిన విషయం తెలిసిందే. దాదాపు కొన్ని నెలల కొర్దీ పెన్నా ప్రవాహం తగ్గకపోవడంతో మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెన్నానది ప్రవాహం నిలిచి పోయి నెలలు గడిచినా దాదాపు 3 నుంచి 5 అడుగుల వరకు ఇసుక రావడంతో పాత రోడు పూర్తిగా పూడిపోయింది. దీంతో వాహనదారులు నానాతిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా మండలంలోని నరనాగిపల్లి, కుర్లపల్లి, చిన్నకోడిపల్లి, నల్లూరు, దందేపల్లి గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రొద్దం నరణాగేపల్లి సచివాలయం నుంచి మండల కేంద్రానికి రావాలంటే కిలోమీటరు మేర చుట్టూ తిరిగి రావాల్సి ఉంది. ఆఖరికి సచివాలయ సిబ్బంది సైతం విధులకు రావాలన్నా తీవ్ర అంతరాయం నెలకొంటోందని స్థానికులు అంటున్నారు. కావున కనీసం రోడ్డు వేయకపోయినా కొద్దిపాటి ఇసుకను తొలగిస్తే సమస్య తీరుతుందని స్థానికులు కోరుతున్నారు.