Dec 20,2022 22:40

కదిరిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

ధర్మవరం టౌన్‌ : పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ మూడు నెలలుగా ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఒటిలు, అలవెన్సు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డిసెంబరు నెల నుండి ప్రతినెలా వేతనంతో పాటు ఒటి, ఇతర అలవెన్స్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో నాయకులు శ్రీరాములు, జిపిరెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌ఛార్జి పెద్దక్క. నాయకులు మల్లికార్జున, నరసింహులు, బీ నరసింహలు తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్రకమిటి పిలుపు మేరకు మంగళవారం కదిరి డిపోవద్ద ఆర్టీసీ కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు నబి రసూల్‌, ఆర్‌ఎస్‌ రెడ్డి, హరి ప్రసాద్‌, పిఇ ఖాన్‌, పిఎస్‌ ఖాన్‌, ఎం.రవి, అనిల్‌ సింహ, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.