Feb 21,2023 22:12

భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - రొద్దం : పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ గుత్తేదారులకు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మండలంలోని చోలేమర్రి, కలిపి, చిన్నమంతూరు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులు, హాజరు, రైతు భరోసా కేంద్రంలో ఎరువులు స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం భవనాల నిర్మాణాల నాణ్యత తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్ధాంతరంగా ఆగిన సచివాలయ, రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని బిల్లులు కూడా సకాలంలో అందజేస్తామని గుత్తేదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ అనంతాచారి, ఎంపిడిఒ రాబర్ట్‌ విల్సన్‌, ఎస్‌ఐ నాగస్వామి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.