Apr 18,2022 15:37

ప్రజాశక్తి-నందిగామ : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ హెల్త్ అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నందిగామ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నందిగామ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 5 నెలల హెల్త్ అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లో పని చేసే ఉద్యోగ, కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పదకొండవ పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మాణిక్యం, నాగరాజు, బేబీ, కోటయ్య, పిచ్చయ్య, జయరాజు ,రూత్తుమ్మ, పుల్లయ్య కార్మికులు పాల్గొన్నారు.