Dec 28,2022 21:29

ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీలు, నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కదిరి ఐసిడిఎస్‌ పడమర ప్రాజెక్టులో అంగన్వాడీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులు, సెంటర్‌ అద్దెలు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ధ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జిఎల్‌ నరసింహులు మాట్లాడుతూ 2019 సంవత్సరం నుండి అనేకమంది అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమస్యను విన్నవించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్‌ లో ఉన్న వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు మాబున్నీసా, ప్రాజెక్ట్‌ నాయకురాలు రంగమ్మ, సువర్ణ, రామలక్ష్మి, సుజాత, లక్ష్మిదేవి, సిఐటియు నాయకులు జగన్మోహన్‌, ముస్తాక్‌, ఫైరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.