Apr 11,2023 20:32

మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలంరెడ్డి

మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలంరెడ్డి
పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి
కొడవలూరు:మండలంలోని గండవరం విద్యుత్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలి అనే కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికీ 8 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి సాధారణ ప్రజల ఆర్థిక భారం పెంచారన్నారు. మాట తప్పని జగన్‌ ఇప్పటికీ 8 సార్లు ఒక్క విద్యుత్‌ విషయంలోనే మాట మార్చారని ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు అమరేంద్ర రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గరికపాటి రాజేంద్ర, కరకట మల్లికార్జున, చక్క మదన్మోహన్‌ రావు, నాశం ప్రసాద్‌, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.