Jul 26,2021 13:07

న్యూఢిల్లీ : కరోనా పుణ్యమాని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు..తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి. ఇక ఎక్కడ నుంచైనా చేయాల్సిన పరిస్థితి. ఇలా ఓ వరుడు తన పెళ్లి మండపంలోనే కూర్చొని వర్క్‌ చేస్తున్న వీడియో ఇటీవల నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరాఠీ సంప్రదాయ దుస్తులను ధరించిన ఆ పెళ్లి కుమారుడు ల్యాప్‌ టాప్‌ తీసుకుని వర్క్‌ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఫోటోగ్రాఫర్‌ జె రాజ్‌ విజరు సింగ్‌ దేశ్‌ముఖ్‌ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో వర్క్‌ ఫ్రం హోం కాదు..వర్క్‌ ఫ్రం వెడ్డింగ్‌ అనే ఫన్నీ కామెంట్‌ను జత చేశారు. ఇందులో పీటలపైనే ఆయన ల్యాప్‌టాప్‌పై వర్క్‌ చేయడాన్ని చూసిన పెళ్లి కుమార్తె కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపిస్తోంది. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేయడంతో నెటిజన్ల నుండి ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి.

ఫన్నీ వీడియోను మీరు చూసేయండి