Feb 04,2023 20:59

పేరుకే ఎఫ్ ఆర్ ఎస్

కడప ప్రతినిధి : జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఫేసియల్‌ రికగ్నై జేషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) పేరుకే పరిమితమైంది. జిల్లాలోనే ప్రభుత్వ ప్రధాన వైద్య కళాశాలగా గుర్తిం పును కలిగి ఉంది. సుమారు 200 మంది ఫ్యాకల్టీ వైద్యులు, సుమారు 20 మంది అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగులు, సుమారు 120 మంది ఫోర్త్‌ క్లాస్‌ ఎంప్లాయీస్‌ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరిలో అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగులు తమ విధులకు డుమ్మాకొట్టడం, సమయపాలన పాటిం చకపోవడం, గైర్హాజరీని క్యాజువల్‌ లీవులుగా మార్చుకునేందుకు ఉన్నతాధికారులతో కుమ్మక్కు కావడం వంటి ఘటనలకు పాల్పడుతున్నారనే ఆరో పణలున్నాయి. ఇటువంటి ప్రభుత్వ ప్రధాన మెడికల్‌ కళాశాలలో 20 శాతం మందికి పైగా ఉద్యోగులు గైర్హాజరు కావడం, మధ్యాహ్నం 11.46 గంటల నుంచి 12.30 గంటలకు సైతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ వేస్తున్నారు. జనవరి నెలలో కొంత మంది ఉద్యోగులు వరుసగా సుమారు 10 రోజులకుపైగా గైర్హాజరీగా నమోదు కావడం గమనార్హం. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ అమలు ఉద్దేశంతో అధికారుల్లో బాధ్యతను గుర్తుచ యడమనే విషయం తెలిసిందే. రిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో ప్రభుత్వ ఆశయం నీరుఃగారిపోతోంది. మెడికల్‌ కళాశాల ఉన్నతాధికారులు, గైర్హాజరీలతో కుమ్మక్కు కావడమే కారణమనే వాదన వినిప ిస్తోంది. కొంతకాలంగా అనంతపురం జిల్లా నుంచి వచ్చే ఓ సూపరింటెండెంట్‌ శనివారం మధ్యాహ్నం 11.46 గంటలకు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ గది దగ్గర ఉన్న ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌లో అటెండెన్స్‌ వేయడం విస్మయాన్ని కలిగించింది. ప్రతిరోజూ అటెండెన్స్‌ వేస్తున్నట్లు సమాచారం. మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌, అడ్మినిస్ట్రేషన్‌ ఉన్నతా ధికారులు ప్రేక్షక పాత్ర వెనుక కుమ్మక్కు ఉందనే వాదన వినిపిస్తోంది. దీనిపై మెడికల్‌ కళాశాలకు చెందిన అధికారులతో ఆరా తీయగా ఆబ్సెంట్లను క్యాజువల్‌ లీవులుగా తీసుకునే అవకాశం ఉందనే వాదన చేయడం గమనార్హం.
లోపాలను సరిదిద్దుతా
ఎఫ్‌ఆర్‌ఎస్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలు నిమిత్తం ముగ్గురు అధికారులను కేటాయించాం. వారి పర్య వేక్షణలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ నడుస్తోందని, ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దు కుంటామని పేర్కొనడం గమనార్హం.
- డాక్టర్‌ సురేఖ, జిజిహెచ్‌ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌, కడప.