May 17,2022 16:29

ప్రజాశక్తి - వత్సవాయి (ఎన్‌టిఆర్‌) : మండలంలోని పెంట్యాల వారి గూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నరన్న సమాచారంతో ఎస్‌ఐ గంధం మహాలక్ష్ముడు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 5 గురిని అదుపులోకి తీసుకుని రూ.3100, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఏపీ గేమింగ్‌ యాక్ట్‌ 9(1) కేసు నమోదు చేసినట్లుగా ఎస్‌ఐ తెలిపారు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.