Mar 23,2023 22:41

గుడిబండలో పేకాట జూదరుల అరెస్టు చూపుతున్న పోలీసులు

చిలమత్తూరు : మండల పరిధిలోని కాపుచన్నం పల్లి గ్రామ సమీపంలో గురవారం పేకాట ఆడుతున్న స్థావరం పై దాడి చేసి నలుగురు జూదరులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితులనుంచి రూ. 4,500 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసు కున్నామన్నారు. నింది తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
గుడిబండ : గుడిబండ సమీపంలోని తుమ్మల మారమ్మ దేవాలయం సమీపంలో బహిరంగస్థలంలో పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మునిప్రతాప్‌ తెలిపారు. ఈసందర్భంగా 29 మందిని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ. 78.200 నగదు, 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈదాడుల్లో కానిస్టేబుళ్లు రఫీ, చంద్ర నాయక్‌, వెంకటేష్‌ నాయక్‌, లక్ష్మి కుమార్‌. తదితరులు పాల్గొన్నారు.