జూదరులను అరెస్టు చేస్తున్న పోలీసులు
రొద్దం : మండలంలోని ఆర్‌ఎల్.కొత్తూరు గ్రామ సమీపంలో కంప చెట్ల వద్ద పేకాట ఆడుతున్న స్థావరం పై పోలీసులు దాడి చేసి జూదరులను అరెస్టు చేశారు. పేకాట ఆడిస్తున్న పేకాట ఆర్గనైజర్ మారుతి తో పాటు మొత్తం 10 మంది పేకాట జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. వారి వద్ద నుండి రూ.58,140 నగదు, 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జమేదార్ కాంతప్ప, పోలీసులు పోతన్న, హనుమంతరాయిడు,అనిల్ రెడ్డి,శ్రీనివాసులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










