Jan 17,2023 21:59

అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న సిఐ, తదితరులు

ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని పలు ప్రాంతాలలో పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్‌ సిఐ సుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు స్థానిక వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ, ఎఎస్‌ఐ పుట్టప్పలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేకాట జూదరుల అరెస్టు వివరాలను వెల్లడించారు. సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధర్మవరంలో ఎలాంటి జూదాలు. కోడిపందేటు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కేశవనగర్‌, పోతిరెడ్డి గ్రౌండ్‌, రమణ ఇంటి ఎదుట బహిరంగ ప్రదేశాలలో పేకాట ఆడుతున్న శిబిరాలపై దాడులు నిర్వహించి 12మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. వారి వద్ద నుంచి రూ.1.73,020 నగదును స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.