Dec 31,2022 20:18

సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-వాల్మీకిపురం : పేదరికం నిర్మూలనకు నవరత్న పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నగిరిమడుగు పంచాయతీ పాతకోటపల్లి, షికారిపాళ్యెం, ముషఉ్టరువాండ్లపల్లి, కొత్తపల్లి, చిన్ననారాయణపల్లి, బురుజుగడ్డ గ్రామాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గడిచిన మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను, వాటితో కలిగిన ప్రయోజనాన్ని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సచివలయ వ్యవస్థతో చరిత్ర సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. సుపరిపాలన, సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ షబ్బీర్‌ అహ్మద్‌, ఎఒ హేమలత, హౌసింగ్‌ ఎఇ సుబ్బారెడ్డి, ఇరిగేషన్‌ ఎఇ రామచంద్ర, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎఇ మిథున్‌ చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శి అశ్వని, సర్పంచ్‌లు రజని, జయచంద్ర, నాయకులు చింతల ఆనందరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, సురేంద్రరెడ్డి, రాయుడు, ఆనంద, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.