రాయచోటి : జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పేదలందరికీ అందిస్తున్నామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సంబేపల్లె మండలం గుణ్ణికుంట్ల-2 సచివాలయ పరిధిలో గురిగింజకుంటలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపిపి ఆవుల నాగశ్రీ లక్ష్మీ, జడ్‌పిటిసి గొర్ల కవిత, సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు చిదంబర్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసి గొర్ల ఉపేంద్రారెడ్డి, గొర్ల రమేశ్‌రెడ్డి, సర్పంచ్ రఘునాథరెడ్డి, ఎంపిటిసి శ్రీధర్‌రెడ్డి, అన్నారెడ్డిలతో కలసి కాల్వవాండ్లపల్లె, వంకవారిపల్లె, మాలపల్లె, మొరం క్రిందపల్లెలలో గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలను అందిస్తు న్నారన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో తేడా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కువగా పథకాలు ఉండేవి కావని, ఇచ్చే అరకొర పథకాలలోనే ఎలా కత్తరించాలో చూసేవారన్నారు. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంతో తేడావుందన్నారు. దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విన్నూత్నంగా ఏడాదిలో ఏయే మాసంలో ఏయే సంక్షేమ పథకాలు అందిస్తామో తెలిపే సంక్షేమ కేలండర్‌ను సిఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ క్యాలెండర్‌లో ఇచ్చిన షెడ్యూల్‌ను ఎక్కడా తప్పకుండా అమలు చేయడంలో దేశంలోనే సిఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ పేదవర్గాలకు వెల్ఫేర్ కేలండర్ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పారంటే చేస్తారు అనే నమ్మకం ప్రజల మనసుల్లో నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో అమరనాధరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










