ఫొటో : పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
పేదలకు దుప్పట్లు పంపిణీ
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంప్లెక్స్ వద్ద శనివారం యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో శనివారం సుమారు 100 మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. అలాగే పేద ప్రజలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచడమే క్రిస్మస్ అర్థమని వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు దైవ సేవకులు సామ్యుల్ ప్రభాకర్, ప్రసాద్ బాబు, రాజేష్, హెంన్రీ అమోస్, రమేష్, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ సభ్యులు వినీత్ కుమార్, సురేష్, విజరు కుమార్, సుకుమార్, జాన్ వెస్లీ, ప్రతాప్, అశోక్ తదితరులున్నారు.










