ప్రజాశక్తి-ఓబులవారిపల్లి : పేదలకు భూములు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బాలిరెడ్డిపల్లి గ్రామంలోని బాలాజినగర్ లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాజినర్, శివాజినగర్, బాలిరేడ్డిపల్లి దళితవాడల్లోని భూమిలేని గ్రామస్తులకు వెంటనే భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దొంగ పాస్‌బుక్‌లను ఆన్‌లైన్‌లను రద్దు చేయాలన్నారు. భూమిని స్వాధీనం చేసుకొన పేదలకు సాగు పట్టాలు ఇవ్వాలని తెలిపారు. లేని పక్షంలో తహశీల్దారు కార్యాలయాన్ని ఈ నెల 27 తేదీన ముటడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జయరామయ్య, పందికాళ్ళ మణి, సిఐటియు జిల్లా అధ్యక్షలు సి.హెచ్.చంద్రశేఖర్, మండల కార్యదర్శి కె.వెంకటరమణ, కె.కెశవులు, రైతు సంఘం నాయుకులు సి.హరి, రమణ, గ్రామస్తులు పాల్గొనారు.










