మాట్లాడుతున్న మంత్రి గోవర్ధన్ రెడ్డి
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : నిరుపేదలకు అండగా వైసీపీ ప్రభుత్వం నిలుస్తోందని, ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తోటపల్లిగూడూరు ఎంపిడిఒ కార్యాలయ ప్రాంగణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి, విజయ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి, కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, ఎంపీపీ స్వర్ణలత, జెడ్పిటిసి శేషమ్మ, ఏఎంసి డైరెక్టర్ మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, తలమంచి సురేంద్ర బాబు, ఎంపీడీఓ హేమలత, తహశీల్దార్ హమీద్ పాల్గొన్నారు.










