Jan 20,2023 21:31

మహిళకు నమస్కరిస్తున్న ఎమ్మెల్యే శంకరనారాయణ

కొత్తచెరువు : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డి శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మైల్‌ సముద్రం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యమ్రంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎంపీపీ గాయత్రీ రెడ్డప్ప రెడ్డి, జెడ్పీటీసీ గంగాదేవి. సర్పంచి ఇందిరమ్మ డాక్టర్‌ నరసింహారెడ్డి వైసీపీ నాయకులు వాల్మీకి శంకర్‌, నాగరాజు, నరేందర్‌ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల : పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ తెలిపారు. మండలంలోని మల సముద్రం, కోరేవాండ్లపల్లి, పూల చెట్ల పల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటిం టికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ లక్ష్మీనరసప్ప యాదవ్‌ ఎంపీపీ ప్రమీల జడ్పిటిసి జయరాం నాయక్‌ సింగల్‌ విండో ఛైర్మన్‌ శివశంకర్‌ రెడ్డి, బయపురెడ్డి, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ శంకర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ నాగభూషణ్‌ రెడ్డి తదితరులతో పాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
తనకల్లు : మండల కేంద్రంలోని ఒకటవ వార్డు సచివాలయం పరిధిలో శుక్రవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పివి. సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పేదలకు చేరువ చేయడానికి సచివాలయ సిబ్బందిని, వాలెంటరీ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ మధుసూదన్‌ రెడ్డి, కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దేశారు భక్తవత్సలరెడ్డి, శ్రీకంఠ రెడ్డి, గణేష్‌ రెడ్డి, రామ్‌ దేశారు, సర్పంచి భర్త రామకృష్ణ, హేమ శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.