ప్రజాశక్తి-కంభంవారిపల్లె(పీలేరు) :
పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్‌రెడ్డి పెద్దపీట వేశారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం కెవి పల్లె మండలం, వగళ్ల పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత సిఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, నవరత్నాల అమలులో భాగంగా పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూందన్నారు. పార్టీలకతీతంగా అమలు చేస్తున్న పథకాలతో పేదలందరికీ లబ్ది చేకూరుతోందని, సచివాలయ, వాలంటరీ వ్యవస్థలతో పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకురావడంతో గ్రామీణులకు ఎంతో వెసులుబాటు కలిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విన్నవించిన సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఈశ్వరమ్మ, జడ్పిటిసి గజ్జల శతి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కారపాకుల భాస్కర్ నాయుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అబ్దుల్ కలీమ్, వైసిపి నాయకులు వెంకటరమణారెడ్డి, గజ్జెల శీను రెడ్డి, కలకడ ఎంపిపి శ్రీదేవి, సర్పంచ్ కొండారెడ్డి, పీలేరు సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష, ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, తహశీల్దారు నరసింహులు, ఏడిఈ సుధాకర్, ఎంఈఓ రెడ్డి బాష, స్థానిక నాయకులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, రఘునాధ రెడ్డి , మల్లికార్జున రెడ్డి , రాంప్రసాద్ నాయుడు, గణపతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.










