ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : పేదలకు సేవలందించడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని యువర్స్ పౌండేషన్ అధ్యక్షులు వైకే శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం యువర్స్ ఫౌండేషన్ సౌజన్యంతో కర్నూల్‌కు చెందిన చక్ర ఆస్పత్రి వారిచే ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు.ఈ వైద్యశిబిరాన్ని దాసెట్టి ఓబులమ్మ జ్ఞాపకార్థం భర్త దాశెట్టి నారాయణస్వామి, దాశెట్టి సుబ్రమణ్యం ఏర్పాటుచేశారు.ఈ శిబిరంలో కంటి చూపు మందగించిన 100 మందికి కంటి వైద్యనిపుణులు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 50 మందిని శాస్ర బిచికిత్సలకు ఎంపిక చేసినట్టు యువర్ ఫౌండేషన్ అధ్యక్షుడు వైకెశ్రీనివాసులు తెలిపారు. అనంతరం డాక్టర్లు కంటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు వైకే శ్రీనివాసులు మాట్లాడుతూ యువర్ పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల పేదల కోసం ఉచిత కంటీ వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ కార్యదర్శి సుంకు సుకుమార్, కోశాధికారి చాంద్ బాషా, సభ్యులు పోలా ప్రభాకర్, రమేశ్ బాబు, కుమారస్వామి, నామాల శ్రీనివాసులు, పిఆర్‌ఒ జయరాం, శ్రీచక్ర ఆస్పత్రి పిఆర్‌ఒ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.










