Feb 14,2023 20:11

సంజీవయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

రాయచోటి : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య పేదల పక్షపాతని నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి ఎస్‌.అల్లా బకాస్‌ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య 102వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడం గొప్ప విశేషమన్నారు. సంజీవయ్య నిరాడంబరుడు, ఆదర్శ ప్రాయుడని అసలుసిసలు కాంగ్రెస్‌ వాది, గొప్ప పరిపాలనాదక్షుడని పేర్కొన్నారు. 63 ఏళ్ల క్రితమే దళితుడైన సంజీవయ్యను ముఖ్యమంత్రిగా, ఎఐసిసి జాతీయ అధ్యక్షునిగా చేసిన పార్టీ దళితులకు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్స్‌ కల్పించింది కాంగ్రెస్‌ పార్టీనేనని పేర్కొన్నారు. ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు చట్ట బద్ధత కల్పించిందన్నారు. సంజీవయ్య స్ఫూర్తితో ప్రతి దళితుడు, ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త దేశం కోసం, కాంగ్రెస్‌ కోసం అంకిత భావంతో కృషి చేయాలని తెలిపారు. మంచి పరిపాలన అధ్యక్షుడు ఎస్సీ, ఎస్టీ నాయకుడు అన్నారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు చెన్నకృష్ణ, పిసిసి సభ్యులు ఖదీర్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మంజునాథ, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు ఖాదర్‌ ఖాన్‌, నియోజకవర్గ మహిళా ప్రెసి డెంట్‌ రవణమ్మ, నియోజకవర్గ యూత్‌ ప్రెసిడెంట్‌ ఖలీద్‌బాషా పాల్గొన్నారు.