ప్రజాశక్తి - రాయచోటి : పేదల ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా జరగాలని కలెక్టర్ గిరీష ఎంపిడిఒలు, హౌసింగ్ ఇంజినీర్లను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న కాలనీలలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఎంపిడిఒలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ప్రతి పేద వారి ఇంటి కల నెరవేరేలా అధికారులు అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 77,161 ఇళ్లు మంజూరయ్యాయిన్నారు. బిబిఎల్ 22,798, బిఎల్ 21,048, ఆర్‌ఎల్ 7084, ఆర్ సి 8132, పూర్తయినవి 8736, మిగిలినవి వివిధ దశలలో ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయిని, ఇంకను ప్రారంభం కానీ వాటన్నిటినీ బిబిఎల్ స్థాయికి తీసుకు రావాలని సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లను ఆదేశించారు. కొత్తగా మంజూరైన ఇళ్లకు సంబంధించి వచ్చేవారం కల్లా రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలన్నారు. ఇల్ల నిర్మాణాలకు సంబంధించి రూ.35 వేల రుణం ఇప్పించాలని డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణను ఆదేశించారు. పొదుపు సంఘం మహిళా సభ్యులు కాకపోయినా, పొదుపు సంఘంలో చేర్పించి వారికి రుణం ఇప్పించాలన్నారు. ఇంకా 3 వేల మందికి ఇవ్వాల్సిన లోన్ వచ్చే వారంలోగా ఇప్పించాలన్నారు. పిఎంఎవై గ్రామీణలో బాగా చేశారని హౌసింగ్ అధికారులను కలెక్టర్ అభినందించారు. స్టేజ్ కన్వెన్షన్‌లో ఓవరల్ 15 శాతం లక్ష్యం జరిగిందన్నారు. అనుకున్న స్థాయిలో లక్ష్యం సాధించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌సి నుంచి కంప్లీషన్ స్టేజ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పీలేరు నియోజకవర్గం ఆర్‌సి నుంచి కంప్లీషన్ స్టేజ్‌లో చాలా వెనకబడిందన్నారు. పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లను టార్గెట్ ఇచ్చి ఇల్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. బిలో బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇళ్లన్నీ పునాది స్థాయికి, పునాది స్థాయిలో ఉన్న ఇళ్లనీ రూప్ లెవెల్‌కు తీసుకురావాలన్నారు. సచివాలయం వారీగా రివ్యూ చేయాలని మండల అభివృద్ధి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ పీడీ శివయ్య, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఎంపడిఒలు, హౌసింగ్ డిఇలు, ఎఇలు, పాల్గొన్నారు.










