రాయచోటి : పేదల సొంతింటి కల సాకారం కానంటోంది. నవరత్నాల్లో భాగంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయోనని లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీలు-పేదలకు ఇళ్లు పథకాన్ని ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా 496 లేఅవుట్లు ఏర్పాటు చేశారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 73,756 గహాలు మంజూరయ్యాయి. రూ.13.24 కోట్ల నిధులు కేటాయించింది. ఆయా లేఅవుట్లలో 12,116 గహాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా మొదలు పెట్టని గృహాలు 6,726 ఉన్నాయి. ఇందులో బిలో బేస్ మెట్ లెవెల్ 23,518, పునాదులు 21,290, గోడలు 7,248, స్లాబులు 6,263, వివిధ దశలలో మిగతా పనులు నత్తనడకన సాగుతున్నాయి ప్రభుత్వమే ఒక గహానికి రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. పైగా 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతోపాటు సిమెంటు ఒక బస్తా ధర రూ.229లతో 90 బస్తాలను, స్టీల్ కేజీ రూ.66లతో 480 కిలోల స్టీల్‌ను తక్కువ రేట్లతో లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ లబ్ధిదారులు గహాలు వేగవంతం కావడం లేదంటే గహ నిర్మాణ శాఖ వారు లబ్ధిదారులకు సరైన అవగాహన కల్పించకపోవడమే లోపమని పలువురు చర్చించు కుంటున్నారు. గృహాలు వేగవంతం చేయాలని వారంలో రెండు, మూడు రోజులు రాష్ట్ర గృహ శాఖ నుంచి సమీక్షలు నిర్వహించినా పనుల్లో వేగం కనిపించడంలేదు. గహ నిర్మాణ శాఖ కాకుండా, ఇతర శాఖను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించి నియమించారు. ఇతర శాఖ వారు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, గహ నిర్మాణ శాఖలో ఆ బాధ్యతను గాలికి వదిలేస్తున్నారుని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 40 శాతం మాత్రమే పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని నారాయ ణరెడ్డిగారిపల్లె వద్ద జగనన్న కాలనీలో నత్తనడక సాగుతున్న పనులను కలెక్టర్ గిరీష గత నెల 22వ తేదీన పరిశీలించారు. కాలనీలో ద్విచక్ర వాహనంలో వీధి వీధి తిరిగి పరిశీలించారు. కాలనీలో వేగవంతం చేయాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ వారికి ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ గృహ నిర్మాణ పనులు నత్తనకు నడకలు నేర్పేవిధంగా సాగుతు న్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లాలో మిగిలిన గృహాలు పూర్తి చేయాలంటే ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందో వేచి చూడాలి.
లక్ష్యాలను పూర్తి చేస్తాం
జిల్లాలో జగనన్న గహాల నిర్మాణ పనుల లక్ష్యాలను పూర్తి చేస్తాం. ఉగాది నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాం. మండల హౌసింగ్ ఇంజినీర్‌తో సమీక్ష సమావేశాల్లో కూడా నిర్వహిస్తున్నాం. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- శివయ్య, హౌసింగ్ పీడీ, రాయచోటి.










