ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : రాష్ట్రంలో బహుజన రాజ్యం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని బిఎస్‌పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం బహుజన సమాజ్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమావేశం తోటపల్లి గూడూరు మండలం విలుకాన పల్లి గ్రామంలో జరిగింది. ఆ పార్టీ మండల అధ్యక్షులు పల్లం రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జానకి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతి ఒక్క బిఎస్పీతోనే సాధ్యమన్నారు. అందుకోసం బహుజన రాజ్యం రావాలని, అందుకు యువత ముందుండి ప్రజలను చైతన్య పరచాలని జానకి ప్రసాద్ కోరారు.బిఎస్పీ సీనియర్ నాయకులు మర్రి రామచంద్రయ్య, సర్వేపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షులు పొన్నూరు ఏడుకొండలు, నియోజకవర్గ నాయకులు దార్ల రమేష్, గోపాల్, విలుకానపల్లి గ్రామ అధ్యక్షులు గెద్ది నరసింహులు, వెంకన్నపాలెం గ్రామ అధ్యక్షులు మామిడి సిసింద్రబాబు, సురేష్ ఉన్నారు.










