Feb 22,2023 22:16

ఆర్థికసాయం అందజేస్తున్న బత్తల యువసేన నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : పేద యువతి వివాహానికి వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ తనవంతు సాయం అందజేశారు. ఎన్‌పి కుంట మండలానికి చెందిన టీ స్టాల్‌ కరీం తన కుమార్తె వివాహానికి బత్తల హరిప్రసాద్‌ను సాయం కోరాడు. స్పందించిన ఆయన బత్తల యువసేన ద్వారా 10 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బత్తల యువసేన నాయకులు ముబారక్‌ తదితరులు పాల్గొన్నారు.